మెహెర్ ఛానల్ – తెలుగు
మెహెర్ బాబా
(వికీపీడియా నుండి) (this is only a test information) మెహెర్ బాబా (ఫిబ్రవరి 25, 1894 – జనవరి 31, 1969) భారతదేశానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు. ఆయన జన్మనామం మెర్వన్ షెరియార్ ఇరానీ. ఆయన తాను ఒక భగవంతుని అవతారంగా ప్రకటించుకున్నాడు. మెర్వన్ షెరియార్ ఇరానీ 1894లో మహారాష్ట్రలోని పూనాలో పుట్టాడు. ఆయన తల్లిదండ్రులు జొరాష్ట్రియన్ మతానికి చెందిన వాళ్ళు. 19 సంవత్సరాల వయసులో ఆయన ఆధ్యాత్మిక అన్వేషణ ప్రారంభమైంది. అందులో భాగంగా అయిదుగురు ఆధ్యాత్మిక గురువులని కలిశాడు. తరువాత 1922 లో ఆయనే ఒక సాంప్రదాయాన్ని ప్రారంభించి 27 ఏళ్ళు వచ్చేసరికి శిష్యులను సంపాదించుకున్నాడు. జులై 10 1925 నుంచి తనువు చాలించేంత వరకు మౌనదీక్షలో ఉన్నాడు. కేవలం చేతి సైగలతో, అక్షరాల పలకతోనే సంభాషించేవాడు. ఆయన తన భక్తబృందంతో జనబాహుళ్యానికి దూరంగా దీర్ఘకాలం గడిపేవాడు. అందులా చాలాసార్లు ఉపవాసం చేసేవాడు. విస్తృతంగా పర్యటించాడు. ప్రజలతో బహిరంగ సమావేశాలు నిర్వహించి కుష్టువ్యాధిగ్రస్తులకు, పేదవాళ్ళకు, మానసిక వ్యాధులతో బాధ పడుతున్నవారికి సేవలు చేసేవాడు. 1931లో మొదటిసారి విదేశాల్లో పర్యటించి అనేకులను అనుచరులుగా చేసుకున్నాడు.1940 వ దశకమంతా బాబా సూఫీలో భాగమైన మాస్ట్స్ అనే ప్రత్యేక వర్గానికి చెందిన ఆధ్యాత్మిక సాధకులతో కలిసి పనిచేశాడు వీరందరూ ఆయన్ను చూడగానే తమ ఆధ్యాత్మిక చేతనత్వాన్ని కనుగొన్నారని మెహెర్ బాబా పేర్కొన్నాడు. 1949 మొదలుకొని ఎంపిక చేసిన బృందంతోనే భారతదేశమంతా అనామకుడిలా పర్యటించాడు. ఈ సమయమంతా తన జీవితంలో నూతన నిగూఢ అధ్యాయంగా పేర్కొన్నాడు. మెహెర్ బాబా తన జీవితంలో రెండు సార్లు తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. ఒకటి 1952 లో అమెరికాలో జరగ్గా మరొకటి భారతదేశంలో 1956 లో జరిగింది. దానివల్ల ఆయన సరిగ్గా నడవలేక పోయాడు. 1962లో , ఆయన తన పాశ్చాత్య శిష్యులనంతా భారతదేశానికి వచ్చి మూకుమ్మడిగా దర్శనం చేసుకోమన్నాడు. దీన్ని ది ఈస్ట్-వెస్ట్ గ్యాదరింగ్ అన్నాడు. విచ్చలవిడిగా మందుల వాడకం వలన పెద్దగా ఉపయోగం ఉండదని 1966లో పేర్కొన్నాడు. ఆరోగ్యం సహకరించకున్నా, ఉపవాసం, ఏకాంతం లాంటి సార్వత్రిక కార్యక్రమాలను 1969, జనవరి 31న ఆయన మరణించే వరకూ కొనసాగిస్తూనే వచ్చాడు. మెహరాబాద్ లోని ఆయన సమాధి ప్రస్తుతం అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. మెహెర్ బాబా జీవిత పరమార్థం గురించి, పునర్జన్మ గురించి, భ్రమతో కూడిన లోకంతీరు గురించి అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు. ఈ ప్రపంచం మిథ్య అనీ భగవంతుడొక్కడే సత్యమనీ, ప్రతి ఒక్కరు తమలోని పరమాత్మను తెలుసుకోవాలని భోదించాడు. అంతే కాకుండా చావు పుట్టుకల వలయం నుంచి బయటపడటానికి అవసరమైన ఆత్మజ్ఞానం గురించి ఆధ్యాత్మిక సాధకులకు అనేక సలహాలిచ్చాడు. ఖచ్చితమైన గురువు ఎలా ఉంటాడో చెప్పాడు. ఆయన భోధనలు డిస్కోర్సెస్ మరియు గాడ్ స్పీక్స్ అనే పుస్తకాలలో పొందుపరచబడ్డాయి. అవతార్ మెహెర్ బాబా ట్రస్ట్, పాప్-కల్చర్ కళాకారులపై ఆయన చూపిన ప్రభావం, డోంట్ వర్రీ బీ హ్యాపీ లాంటి చిన్న చిన్న చమక్కులు ఆయన వదిలి వెళ్ళిన వారసత్వ సంపద. మెహెర్ బాబా మౌనం ఆయన అనుచరుల్లోనే గాక బయటి ప్రపంచానికి కూడా ఒక రహస్యంగా మిగిలిపోయింది. payday loans ct