PART 1: States of Consciousness

1.1

PART 1

States of Consciousness

ALL souls (atmas) were, are and will be in the Over-Soul (Paramatma).

Souls (atmas) are all One.

All souls are infinite and eternal. They are formless.

All souls are One; there is no difference in souls or in their being and existence as souls.

ఆత్మలన్నీ ఇంతకు ముందు పరమాత్మలోనే ఉండేవి, ఇప్పుడు కూడా పరమాత్మలోనే ఉన్నాయి, ఇక ముందు కూడా పరమాత్మలోనే ఉంటాయి.

ఆత్మలన్నీ ఒక్కటే.

ఆత్మలన్నీ అనంతమైనవి, శాశ్వతమైనవి. అవి రూపం లేనివి.

అన్ని ఆత్మలు ఒక్కటే; ఆత్మలలో లేదా ఆత్మలుగా వాటి ఉనికి మరియు అస్తిత్వాలలో ఎలాంటి భేదం లేదు.

1.2

There is a difference in the consciousness of souls; 

there is a difference in the planes of consciousness of souls; 

there is a difference in the experience of souls and thus 

there is a difference in the state of souls.

ఆత్మల యొక్క చైతన్యంలో భేదం ఉంది; 

ఆత్మల యొక్క చైతన్య భూమికలలో భేదం ఉంది;

ఆత్మల యొక్క అనుభవంలో భేదం ఉంది; 

అందువలన ఆత్మల యొక్క స్థితులలో భేదం ఉంది.

1.3

Most souls are conscious of the gross body (sthul sharir); 

some souls are conscious of the subtle body (pran);

a few souls are conscious of the mental body (mind or mana); and

a very few souls are conscious of Self.

అత్యధిక ఆత్మలకు స్థూల శరీరం (స్థూలశరీరం) యొక్క ఎరుక ఉంటుంది; 

కొన్ని ఆత్మలకు సూక్ష్మశరీరం (ప్రాణం) యొక్క ఎరుకఉంటుంది; 

తక్కువ ఆత్మలకు మానసిక శరీరం (మనస్సు) యొక్క ఎరుక ఉంటుంది; 

అతి తక్కువ ఆత్మలకు స్వస్వరూపం యొక్క ఎరుక ఉంటుంది.

1.4

Most souls have experience of the gross sphere (world);

some souls have experience of the subtle sphere (world);

a few souls have experience of the mental sphere (world); and 

a very few souls have experience of the Over-Soul.

అత్యధిక ఆత్మలు స్థూల భువనం (ప్రపంచం) యొక్క అనుభవాన్ని కలిగి ఉంటాయి; 

కొన్ని ఆత్మలు సూక్ష్మ భువనం (ప్రపంచం) యొక్క అనుభవాన్ని కలిగి ఉంటాయి; 

తక్కువ ఆత్మలు మానసిక భువనం (ప్రపంచం) యొక్క అనుభవాన్ని కలిగి ఉంటాయి; 

అతి తక్కువ ఆత్మలు పరమాత్మ యొక్క అనుభవాన్ని కలిగి ఉంటాయి.

1.5

Most souls are on the gross plane (anna bhumika); 

some souls are on the subtle plane (pran bhumika);

a few souls are on the mental plane (mano bhumika); and 

a very few souls are on the plane beyond the mental plane (vidnyan).

అత్యధిక ఆత్మలు స్థూల భూమిక (అన్నభూమిక) మీద ఉంటాయి; 

కొన్ని ఆత్మలు సూక్ష్మ భూమిక (ప్రాణభూమిక) మీద ఉంటాయి; 

తక్కువ ఆత్మలు మానసిక భూమిక (మనోభూమిక) మీద ఉంటాయి; 

అతి తక్కువ ఆత్మలు మానసిక భూమికకు ఆవల ఉన్న భూమిక (విజ్ఞాన్) మీద ఉంటాయి.

2.1

Most souls have great binding; 

some souls have little binding; 

a few souls have very little binding; and 

a very few souls have absolutely no binding.

అత్యధిక ఆత్మలు అధిక బంధనాన్ని కలిగి ఉంటాయి; 

కొన్ని ఆత్మలు స్వల్ప బంధనాన్ని కలిగి ఉంటాయి; 

తక్కువ ఆత్మలు అతి స్వల్ప బంధనాన్ని కలిగి ఉంటాయి; 

అతి తక్కువ ఆత్మలు అస్సలు బంధనమే లేకుండా ఉంటాయి.

2.2

All these souls (atmas) of different consciousness, of different experiences, of different states are in the Over-Soul (Paramatma).

విభిన్న చైతన్యాలను, విభిన్న అనుభవాలను, విభిన్న స్థితులను కలిగి ఉన్న ఈ ఆత్మలన్నీ పరమాత్మలోనే ఉంటాయి. 

2.3

If, now, all souls are in the Over-Soul and are all One, then why is there any difference in the consciousness, in the planes, in the experiences and in the states?

ఆత్మలన్నీ పరమాత్మలోనే ఉంటూ, అన్నీ ఒక్కటే  అయినప్పుడు,  వాటి చైతన్యంలోను, భూమికలలోను, అనుభవాలలోను, స్థితులలోను భేదం ఎందుకు ఉంది?

2.4

The cause of this difference is that the souls have different and diverse impressions (sanskaras).*

* [See also Meher Baba, “The Formation and Function of Sanskaras,” Discourses, 7th ed. (Myrtle Beach, SC: Sheriar Press, 1987), 32–39. Ed.]

ఆత్మలు విభిన్నమైన మరియు వివిధ రకాలకు చెందిన సంస్కారాలను* కలిగి ఉండడమే ఈ భేదానికి కారణం.

*[మెహెర్ బాబా రచించిన డిస్కోర్సెస్ అనే గ్రంథం యొక్క 7వ సంకలనంలోని (మిర్టిల్ బీచ్, సౌత్ కరొలినా, షెరియార్ ప్రెస్, 1987) 32–39 పేజీలలో గల  “ది ఫార్మేషన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ సంస్కారాస్” అనే అధ్యాయాన్ని కూడా చూడగలరు. – సంపాదకులు]

2.5

Most souls have gross impressions;

some souls have subtle impressions;

 a few souls have mental impressions; and 

a very few souls have no impressions at all.

అత్యధిక ఆత్మలు స్థూల సంస్కారాలను కలిగి ఉంటాయి; 

కొన్ని ఆత్మలు సూక్ష్మ సంస్కారాలను కలిగి ఉంటాయి; 

తక్కువ ఆత్మలు మానసిక సంస్కారాలను కలిగి ఉంటాయి; 

అతి తక్కువ ఆత్మలు అస్సలు ఏ సంస్కారాలు లేకుండా ఉంటాయి.

2.6

Souls having gross impressions, 

souls having subtle impressions, 

souls having mental impressions and 

souls having no impressions, are all souls in the Over-Soul and all are One.

స్థూల సంస్కారాలను కలిగిన ఆత్మలు, 

సూక్ష్మ సంస్కారాలను కలిగిన ఆత్మలు, 

మానసిక సంస్కారాలను కలిగిన ఆత్మలు, 

ఏ సంస్కారాలు లేని ఆత్మలు ఇవన్నీ పరమాత్మలోనే ఉంటాయి మరియు ఇవన్నీ ఒక్కటే.

2.7

Souls with gross impressions have consciousness of the gross body (sthul sharir) and have experience of the gross sphere.

స్థూల సంస్కారాలు గల ఆత్మలు స్థూల శరీరం (స్థూలశరీరం) యొక్క చైతన్యాన్ని మరియు స్థూల భువనం యొక్క అనుభవాన్ని కలిగి ఉంటాయి.

2.8

Souls with subtle impressions have consciousness of the subtle body (pran) and have experience of the subtle sphere.

సూక్ష్మ సంస్కారాలు గల ఆత్మలు సూక్ష్మ శరీరం (ప్రాణం) యొక్క చైతన్యాన్ని మరియు సూక్ష్మ భువనం యొక్క అనుభవాన్ని కలిగి ఉంటాయి.

2.9

Souls with mental impressions have consciousness of the mental body (mana or mind) and have the experience of the mental sphere†.

SPHEREBODY
MysticMysticSufiVedantic
Gross Sphere(World)Gross BodyJism-e-KasifSthul Sharir
Subtle Sphere(World)Subtle BodyJism-e-LatifSukshma Sharir(Pran)
Mental Sphere(World)Mental BodyJism-e-AltafKaran Sharir(Manas)

మానసిక సంస్కారాలు గల ఆత్మలు మానసిక శరీరం (మనస్సు) యొక్క చైతన్యాన్ని మరియు మానసిక భువనం† యొక్క అనుభవాన్ని కలిగి ఉంటాయి.

భువనంశరీరం
మార్మికమార్మికసూఫీవేదాంత
స్థూల భువనం (ప్రపంచం)స్థూల శరీరంజిస్మ్కసీఫ్స్థూలశరీరం
సూక్ష్మ భువనం (ప్రపంచం)సూక్ష్మ శరీరంజిస్మ్లతీఫ్సూక్ష్మశరీరం (ప్రాణం)
మానసిక భువనం (ప్రపంచం)మానసిక శరీరంజిస్మ్అల్తాఫ్కారణశరీరం (మనస్సు)

2.10

Souls with no impressions have consciousness of Self (soul, atma) and have the experience of the Over-Soul (Paramatma).

ఏ సంస్కారాలు లేని ఆత్మలు తమ స్వస్వరూపం (ఆత్మ) యొక్క చైతన్యాన్ని మరియు పరమాత్మ యొక్క అనుభవాన్ని కలిగి ఉంటాయి.

3.1

Thus souls with gross impressions experience the gross sphere through the gross body; that is, they experience different and diverse experiences such as seeing, hearing, smelling, eating, sleeping, clearing the bowels and urinating. All these are experiences of the gross sphere.

ఈ విధంగా, స్థూల సంస్కారాలు గల ఆత్మలు స్థూల శరీరం ద్వారా స్థూల భువనాన్ని అనుభవిస్తాయి. అనగా చూడడం, వినడం, వాసన చూడడం, తినడం, నిద్రించడం, మలమూత్ర విసర్జనం లాంటి విభిన్నమైన, వివిధ రకాలైన అనుభవాలను అవి పొందుతాయి. ఇవన్నీ స్థూల భువనానికి చెందిన అనుభవాలు.

3.2

Souls with subtle impressions experience successively three planes of the subtle sphere through the subtle body, and in these three planes they have only the experiences of seeing, smelling and hearing.

సూక్ష్మ సంస్కారాలు గల ఆత్మలు సూక్ష్మ శరీరం ద్వారా సూక్ష్మ భువనానికి చెందిన మూడు భూమికలను వరుసగా అనుభవిస్తాయి. ఈ మూడు భూమికలలోను చూడడం,  వాసన చూడడం, వినడం అనే అనుభవాలను మాత్రమే అవి పొందుతాయి.

3.3

Souls with mental impressions, through the mental body or mind, in the mental sphere experience only seeing, and this seeingis the seeing of God.

మానసిక సంస్కారాలు గల ఆత్మలు మానసిక శరీరం లేదా మనస్సు ద్వారా  మానసిక భువనంలో చూడడం అనే అనుభవాన్ని మాత్రమే పొందుతాయి; ఇక్కడ చూడడం అంటే భగవంతుడిని చూడడం.

3.4

Souls having no impressions, through the Self experience the infinite power, infinite knowledge and infinite bliss of the Over-Soul.

ఏ సంస్కారాలు లేని ఆత్మలు, తమ స్వస్వరూపం ద్వారా పరమాత్మ యొక్క అనంత శక్తి, అనంత జ్ఞానం మరియు అనంత ఆనందాల అనుభవాన్ని పొందుతాయి.

3.5

The soul that is conscious of the gross body is not conscious of the subtle body, not conscious of the mental body, and not conscious of Self.

స్థూల శరీరం యొక్క ఎరుకగల ఆత్మకు సూక్ష్మ శరీరం యొక్క ఎరుక ఉండదు, మానసిక శరీరం యొక్క ఎరుక ఉండదు, స్వస్వరూపం యొక్క ఎరుక ఉండదు.

3.6

The soul that is conscious of the subtle body is not conscious of the gross body, not conscious of the mental body, and not conscious of Self.

సూక్ష్మ శరీరం యొక్క ఎరుకగల ఆత్మకు స్థూల శరీరం యొక్క ఎరుక ఉండదు, మానసిక శరీరం యొక్క ఎరుక ఉండదు, స్వస్వరూపం యొక్క ఎరుక ఉండదు

3.7

The soul that is conscious of the mental body is not conscious of the gross body, not conscious of the subtle body, and not conscious of Self.

మానసిక శరీరం యొక్క ఎరుకగల ఆత్మకు స్థూల శరీరం యొక్క ఎరుక ఉండదు సూక్ష్మ శరీరం యొక్క ఎరుక ఉండదు, స్వస్వరూపం యొక్క ఎరుక ఉండదు

3.8

The soul that is conscious of Self is not conscious of the gross body, not conscious of the subtle body, and not conscious of the mental body.

స్వస్వరూపం యొక్క ఎరుకగల ఆత్మకు స్థూల శరీరం యొక్క ఎరుక ఉండదు, సూక్ష్మ శరీరం యొక్క ఎరుక ఉండదు, మానసిక శరీరం యొక్క ఎరుక ఉండదు.

3.9

The soul that has experience of the gross world does not have experience of the subtle world, nor experience of the mental world, nor does it have experience of the Over-Soul.

స్థూల ప్రపంచం యొక్క అనుభవం గల ఆత్మ సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవాన్ని, మానసిక ప్రపంచం యొక్క అనుభవాన్ని, పరమాత్మ యొక్క అనుభవాన్ని కలిగి ఉండదు. 

3.10

The soul that has experience of the subtle world does not experience the gross world, nor does it have experience of the mental world, nor does it have experience of the Over-Soul.

సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవం గల ఆత్మ స్థూల ప్రపంచం యొక్క అనుభవాన్ని, మానసిక ప్రపంచం యొక్క అనుభవాన్ని, స్వస్వరూపం యొక్క అనుభవాన్ని కలిగి ఉండదు. 

3.11

The soul that has experience of the mental world does not experience the gross world, nor does it experience the subtle world, nor does it have experience of the Over-Soul.

మానసిక ప్రపంచం యొక్క అనుభవం గల ఆత్మ స్థూల ప్రపంచం యొక్క అనుభవాన్ని, సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవాన్ని, పరమాత్మ యొక్క అనుభవాన్ని కలిగి ఉండదు. 

3.12

The soul that has experience of the Over-Soul does not experience the gross world, nor does it experience the subtle world, nor does it experience the mental world. That is, the soul that is conscious of Self and has experience of the Over-Soul is not conscious of the gross body, subtle body and mental body and does not experience the gross, subtle and mental spheres (worlds).

పరమాత్మ యొక్క అనుభవం గల ఆత్మ స్థూల ప్రపంచం యొక్క అనుభవాన్ని, సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవాన్ని, మానసిక ప్రపంచం యొక్క అనుభవాన్ని కలిగి ఉండదు. అనగా, స్వస్వరూపం యొక్క ఎరుక మరియు పరమాత్మ యొక్క అనుభవం గల ఆత్మకు  స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, మానసిక శరీరాల యొక్క ఎరుక ఉండదు మరియు స్థూల, సూక్ష్మ, మానసిక భువనాల (ప్రపంచాల) యొక్క అనుభవం ఉండదు.

4.1

This means that in order to have consciousness of Self and to have the experience of the Over-Soul, the soul must lose consciousness of the gross, subtle and mental bodies. But as long as the soul is impressioned either by the gross, subtle or mental impressions, the soul consistently and respectively has consciousness of the gross body, subtle body or mental body, and the gross, subtle and mental experiences are persistently and necessarily undergone.

దీని అర్థమేమిటంటే, స్వస్వరూపం యొక్క చైతన్యం, పరమాత్మ యొక్క అనుభవం పొందాలంటే ఆత్మ స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాల చైతన్యాన్ని తప్పనిసరిగా పోగొట్టుకోవాలి. కాని, ఆత్మ స్థూల, సూక్ష్మ లేదా మానసిక సంస్కారాలతో ముద్రితమై ఉన్నంత వరకూ, ఆత్మ ఏకరీతిగా మరియు వరుసగా స్థూల శరీరం, సూక్ష్మ శరీరం లేదా మానసిక శరీరం యొక్క చైతన్యాన్ని కలిగి ఉండి, స్థూల, సూక్ష్మ లేదా మానసిక అనుభవాలను నిరంతరాయంగా, తప్పనిసరిగా పొందాలి.

4.2

The obvious reason for this is that as long as the consciousness of the soul is impressed by gross impressions, there is no way out except to experience these gross impressions through the gross body.

దీనికి స్పష్టమైన కారణమేమిటంటే, ఆత్మ యొక్క చైతన్యం మీద స్థూల సంస్కారాల ముద్రలు ఉన్నంత వరకు, స్థూల శరీరం ద్వారా ఈ స్థూల సంస్కారాలను అనుభవించడం తప్ప వేరే మార్గం లేదు.

4.3

Similarly, as long as the consciousness of the soul is impressed by subtle impressions, there is no way out but to experience these subtle impressions through the subtle body.

అదే విధంగా, ఆత్మ యొక్క చైతన్యం మీద సూక్ష్మ సంస్కారాల ముద్రలు ఉన్నంత వరకు, సూక్ష్మ శరీరం ద్వారా ఈ సూక్ష్మ సంస్కారాలను అనుభవించడం తప్ప వేరే మార్గం లేదు.

4.4

Similarly, as long as the consciousness of the soul is impressed by mental impressions, there is no escape but to experience these mental impressions through the mental body.

అలాగే, ఆత్మ యొక్క చైతన్యం మీద మానసిక సంస్కారాల ముద్రలు ఉన్నంత వరకు, మానసిక శరీరం ద్వారా ఈ మానసిక సంస్కారాలను అనుభవించడం తప్ప వేరే మార్గం లేదు.

4.5

As impressions of the gross, subtle and mental vanish or completely disappear, the consciousness of the soul is automatically and obviously directed and focussed towards itself, and this soul then necessarily has no alternative but to absorb experience of the Over-Soul.

స్థూల, సూక్ష్మ, మానసిక సంస్కారాలు మాయమైనప్పుడు లేదా పూర్తిగా తుడిచివేయబడినప్పుడు, ఆత్మ యొక్క చైతన్యం తనంత తానుగా స్పష్టంగా, తనవైపునకే మరలి, తనపైననే కేంద్రీకృతం అవుతుంది. అప్పుడీ ఆత్మకు పరమాత్మ అనుభవాన్ని పొందడం తప్ప, వేరే మార్గం లేదు.

4.6

Now, gross, subtle and mental bodies are nothing but the shadows of the soul. The gross, subtle and mental spheres (worlds) arenothing but the shadows of the Over-Soul.

స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాలు ఆత్మ యొక్క నీడలు తప్ప మరేవీ కావు. స్థూల, సూక్ష్మ, మానసిక భువనాలు (ప్రపంచాలు) పరమాత్మ యొక్క నీడలు తప్ప మరేవీ కావు.

4.7

Gross, subtle and mental bodies are finite, have forms and are changeable and destructible. The gross, subtle and mental worlds are false; they are zero, imagination and vacant dreams. The only reality is the Over-Soul (Paramatma).

స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాలు పరిమితమైనవి, రూపాలు కలిగినవి, మార్పుకు లోనయ్యేవి మరియు నాశనమయ్యేవి. స్థూల, సూక్ష్మ, మానసిక ప్రపంచాలు అసత్యమైనవి; అవి సున్న, ఊహ, ఉత్త కలలు. పరమాత్మయే ఏకైక సత్యం.

4.8

Therefore when the soul with its gross, subtle and mental bodies experiences the gross, subtle and mental worlds, the soul actually experiences in reality the shadows of the Over-Soul with the help of its own shadows.

అందువలన, ఆత్మ తన స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాలతో స్థూల, సూక్ష్మ, మానసిక ప్రపంచాలను అనుభవించేటప్పుడు, వాస్తవానికి ఆత్మ, తన నీడల సహాయంతో పరమాత్మ యొక్క నీడలను అనుభవిస్తుంది.

4.9

In other words, the soul with its finite and destructible form experiences falsity, zero, imagination and a vacant dream.

మరో విధంగా చెప్పాలంటే, పరిమితమైన మరియు నాశనమయ్యేటువంటి తన రూపంతో ఆత్మ అసత్యతను, శూన్యాన్ని, ఊహను, ఉత్త కలను అనుభవిస్తుంది. 

5.1

Only when the soul experiences the Over-Soul with its Self does it experience the Real with reality.

ఆత్మ, తన స్వస్వరూపంతో పరమాత్మను అనుభవించినప్పుడు మాత్రమే, అది సత్యత్వంతో సత్యాన్ని అనుభవిస్తుంది.

5.2

When the soul is conscious of its gross body, then this soul identifies itself with the gross body and takes itself as the gross body.

ఆత్మకు స్థూల శరీరం యొక్క ఎరుక ఉన్నపుడు, అది స్థూల శరీరంతో తాదాత్మ్యం చెంది (ఏకమని గుర్తించి), తనను తాను స్థూల శరీరం గానే భావిస్తుంది.

5.3

This means that the infinite, eternal, formless soul finds itself as finite, mortal and having form.

దీని అర్థమేమిటంటే, అనంతం, శాశ్వతం, రూపంలేనిది అయిన ఆత్మ, తనను తాను పరిమితమైనదిగా, మరణించేదిగా, రూపం కలదిగా భావిస్తుంది.

5.4

Impressions (sanskaras) are the cause of this ignorance. In the beginning the soul, which is eternally in the Over-Soul, at first acquires ignorance through impressions rather than acquiring Knowledge.

సంస్కారాలే ఈ అజ్ఞానానికి కారణం. శాశ్వతంగా పరమాత్మలోనే ఉన్న ఆత్మ, ఆరంభంలో సంస్కారాల కారణంగా మొదట జ్ఞానానికి బదులు అజ్ఞానాన్ని పొందుతుంది.

5.5

When the soul acquires a particular form (body or sharir) according to particular impressions, it feels and experiences itself as being that particular form.

ఆత్మ తన సంస్కారాలకు అనుగుణంగా ఒక నిర్దిష్టమైన రూపాన్ని (శరీరం) పొందినప్పుడు, ఆ నిర్దిష్టమైన రూపమే తాను అనే భావనను, అనుభవాన్ని పొందుతుంది.

5.6

Soul in its stone-form experiences itself as stone. Accordingly, in due course, the soul experiences and feels that it is metal, vegetable, worm, fish, bird, animal, man or woman. Whatever be the type of gross form and whatever be the shape of the form, the soul spontaneously associates itself with that form, figure and shape, and experiences that it is itself that form, figure and shape.

రాతిరూపంలో ఉన్న ఆత్మ, తాను రాయిననే అనుభవాన్ని పొందుతుంది. అదేవిధంగా, కాలగమనంలో ఆత్మ తాను లోహాన్నని, వృక్షాన్నని, క్రిమినని, చేపనని, పక్షినని, జంతువునని, పురుషుడు లేదా స్త్రీ ననే అనుభవాన్ని, భావనను పొందుతుంది. ఆ స్థూల రూపం ఏ రకానికి చెందినదైనా, దాని ఆకారం ఏదైనా, ఆత్మ ఆ రూపంతోను, ఆ ఆకృతితోను, ఆ ఆకారంతోను అప్రయత్నపూర్వకంగా సాహచర్యం చేసి, తానే ఆ రూపం, ఆ ఆకృతి, ఆ ఆకారం అనే అనుభవాన్ని పొందుతుంది.

5.7

When the soul is conscious of the subtle body, then this soul experiences that it is the subtle body.

ఆత్మకు సూక్ష్మ శరీరం యొక్క ఎరుక ఉన్నపుడు, తాను సూక్ష్మ శరీరాన్ని అనే అనుభవాన్ని ఈ ఆత్మ పొందుతుంది.

5.8

When the soul becomes conscious of the mental body, then this soul experiences that it is the mental body.

ఆత్మకు మానసిక శరీరం యొక్క ఎరుక ఉన్నపుడు, తాను మానసిక శరీరాన్ని అనే అనుభవాన్ని ఈ ఆత్మ పొందుతుంది.

5.9

It is only because of impressions (nuqush-e-amalorsanskaras)that the soul without form, the Infinite Soul, experiences that it is veritably a gross body (sthul sharir), or a subtle body (pran) or a mental body (mana or mind).

ఏ రూపం లేని అనంతమైన ఆత్మ, కేవలం సంస్కారాల (నుకూష్-ఎ-అమల్కారణంగానే, తాను నిజంగా ఒక స్థూల శరీరాన్ని (స్థూలశరీరం) లేదా ఒక సూక్ష్మ శరీరాన్ని (ప్రాణం) లేదా ఒక మానసిక శరీరాన్ని (మనస్సు) అనే అనుభవాన్ని పొందుతుంది.

5.10

The soul, while experiencing the gross world through gross forms, associates with and dissociates from innumerable gross forms. The association with and dissociation from gross forms are termed birth and death respectively.

5.10

The soul, while experiencing the gross world through gross forms, associates with and dissociates from innumerable gross forms. The association with and dissociation from gross forms are termed birth and death respectively.

ఆత్మ స్థూల రూపాల ద్వారా స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తున్నపుడు, అసంఖ్యాకమైన స్థూల రూపాలతో సాహచర్యం చేస్తూ, వేరుపడుతూ ఉంటుంది. ఈ స్థూల రూపాలతో సాహచర్యం చేయడం మరియు వేరుపడడం అనేవి వరుసగా జననం మరియు  మరణం అని పిలవబడుతున్నాయి.

5.11

It is only because of impressions that the eternal, immortal soul, existing in reality without births and without deaths, has to experience births and deaths innumerable times.

వాస్తవానికి చావు పుట్టుకలు లేని శాశ్వతమైన, అమరమైన ఆత్మ కేవలం సంస్కారాల కారణంగానే అసంఖ్యాకమైన పర్యాయాలు జనన మరణాలను పొందవలసి వస్తుంది.

5.12

While the soul has to undergo this experience of innumerable births and deaths because of impressions, it has not only to experience the gross world, which is a shadow of the Over-Soul and which is false, but together with it the soul has also to experience the happiness and misery, virtue and vice of the gross world.

సంస్కారాల కారణంగా ఆత్మ అసంఖ్యాకమైన జనన మరణ అనుభవాలను పొందాల్సి ఉన్నప్పుడు, అది పరమాత్మ యొక్క నీడ మరియు అసత్యం అయిన స్థూల ప్రపంచం యొక్క అనుభవాన్ని పొందడమే కాకుండా, దానితో పాటు స్థూల ప్రపంచానికి సంబంధించిన సుఖదుఃఖాలను, పాపపుణ్యాలను కూడా అనుభవించాల్సి ఉంటుంది.

6.1

It is only because of impressions that the soul, which is beyond and free from happiness and misery, virtue and vice, has necessarily to undergo experiences of misery and happiness, vice and virtue.

సుఖదుఃఖాలకు, పాపపుణ్యాలకు అతీతంగా, స్వేచ్ఛగా ఉండే ఆత్మ కేవలం సంస్కారాల కారణంగానే, సుఖదుఃఖాలను, పాపపుణ్యాలను తప్పనిసరిగా అనుభవించాల్సి వస్తుంది.

6.2

Now this much is established, that the experiences of births and deaths, happiness and misery, virtue and vice are experienced only by the gross form of the soul while experiencing the gross world; but the gross form of the soul is a shadow of the soul and the gross world is a shadow of the Over-Soul.

ఇప్పటి వరకు నిర్ధారించబడింది ఏమిటంటే, ఆత్మ స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆత్మ యొక్క స్థూల రూపం మాత్రమే జననమరణాల, సుఖదుఃఖాల, పాపపుణ్యాల అనుభవాలను పొందుతుంది. కాని, ఆత్మ యొక్క స్థూల రూపం ఆత్మ యొక్క ఒక నీడయే మరియు స్థూల ప్రపంచం పరమాత్మ యొక్క ఒక నీడయే.

6.3

Thus all the experiences of births and deaths, virtue and vice, happiness and misery experienced by the soul are nothing but the experiences of the shadow. Hence all that is thus experienced is false.

ఈ విధంగా, ఆత్మ అనుభవించే జననమరణాల, పాపపుణ్యాల, సుఖదుఃఖాల అనుభవాలన్నీ నీడ యొక్క అనుభవాలే తప్ప మరేమీ కాదు. కనుక, ఈ విధంగా అనుభవించబడినదంతా అసత్యమే.

6.4

Atma in Reality Is Paramatma

 In order to clarify the relationship of “atma-Paramatma” we compare Paramatma with an infinite ocean, a limitless ocean, and the atma as a drop in this ocean. The atma is never out of this limitlessocean (Paramatma).

ఆత్మపరమాత్మల” సంబంధాన్ని స్పష్టంగా తెలియపరిచేందుకు, పరమాత్మను అనంతమైన  ఒక మహాసాగరంతోను, అనగా అవధులులేని ఒక మహాసాగరంతోను, ఆత్మను ఈ మహాసాగరంలోని ఒక బిందువుతోను పోలుద్దాం. ఆత్మ, ఈ అవధులులేని మహాసాగరానికి (పరమాత్మకు) ఆవల ఎన్నడూ లేదు.

6.5

 The atma can never be out of Paramatma because Paramatma is infinite and unlimited. How can the atma come out of, or have a place beyond, the limitlessness of the limitless? Therefore the atma is in Paramatma.

పరమాత్మ అనంతం, అపరిమితం కాబట్టి, ఆత్మపరమాత్మ నుండి వేరుగా ఎన్నటికీ ఉండలేదు. అవధులులేని పరమాత్మ యొక్క అవధులులేనితనం నుండి ఆత్మ బయటకు ఎలా రాగలదు? లేదా దానికి అతీతంగా ఒక స్థానాన్ని ఎలా కలిగి ఉండగలదు? కనుక, ఆత్మ పరమాత్మలోనే ఉంటుంది.

6.6

After establishing the primary fact that the atma is in Paramatma we go a step further and say that atma is Paramatma. How?

ఆత్మపరమాత్మ లోనే ఉంటుదనే ప్రాథమిక వాస్తవాన్ని నిర్ధారించుకున్న తరువాత, మరో అడుగు ముందుకు వేసి ఆత్మ పరమాత్మ యే అని అందాం. అదెలా?

6.7

 For example, let us imagine an unlimited ocean. Let us also imagine that we separate or take out one iota of ocean from the limitless expanse of this unlimited ocean. It follows then that this iota of ocean, while in the limitless ocean, before separation is ocean itself, and is not there in the shoreless ocean as an iota of the ocean, because every iota of ocean, when not limited by the limitations of a drop, is unlimited ocean.

ఉదాహరణకు, ఒక అపరిమిత మహాసాగరాన్ని ఊహించుకుందాం. ఈ అపరిమిత మహాసాగరం యొక్క అవధులులేని విశాలత నుండి ఒక మహాసాగర లేశాన్ని వేరుచేసామనో లేక బయటకుతీసామనో ఊహించుకుందాం. అవధులులేని మహాసాగరంలో ఉన్న ఈ మహాసాగర లేశం వేరుపడటానికి ముందు మహాసాగరంగానే ఉంది కాని, ఆ అపార మహాసాగరంలో ఒక మహాసాగర లేశంగా లేదు. ఎందుకంటే, ఒక బిందువు యొక్క పరిమితులచే పరిమితం కానప్పుడు ప్రతి మహాసాగర లేశం అపరిమిత మహాసాగరమే అవుతుంది. 

6.8

It is only when an iota of ocean is separated from the unlimited ocean, or is taken out of the unlimited ocean as a drop, that this iota of ocean obtains its separate existence as a drop of the shoreless ocean, and that this iota of ocean begins to be looked upon as a drop of the unlimited ocean.

అపరిమిత మహాసాగరం నుండి ఒక మహాసాగర లేశం వేరుచేయబడినప్పుడు లేదా అపరిమిత మహాసాగరం నుండి  ఒక బిందువుగా బయటకు తీసివేయబడినప్పుడు మాత్రమే, ఈ మహాసాగర లేశం, అపార మహాసాగరం యొక్క ఒక బిందువుగా వేర్పాటు (వేరుపడిన) ఉనికిని పొందుతుంది. అలా, మహాసాగరం యొక్క ఈ మహాసాగర లేశం అపరిమిత మహాసాగరానికి చెందిన ఒక బిందువుగా పరిగణింపబడుతుంది.  

7.1

In other words, the infinite, unlimited and limitless ocean itself is now looked upon as merely a drop of that infinite, unlimited and limitless ocean. And in comparison to that infinite, unlimited and limitless ocean this iota of ocean, or this drop of the iota of ocean, is most finite and most limited with infinite limitations. That is, the infinitely free iota finds itself infinitely bound.

మరో విధంగా చెప్పాలంటే, అనంతం, అపరిమితం, అవధులులేనిది అయిన మహాసాగరం, ఇప్పుడు కేవలం అనంతం, అపరిమితం, అవధులులేనిది అయిన ఈ మహాసాగరానికి చెందిన ఒక బిందువుగానే చూడబడుతుంది. అనంతం, అపరిమితం, అవధులులేనిది అయిన ఆ మహాసాగరంతో పోల్చి చూస్తే, మహాసాగరం యొక్క ఈ మహాసాగర లేశం లేదా మహాసాగరానికి చెందిన మహాసాగర లేశం అనే ఈ  బిందువు, అనంత పరిమితులు కలిగిన అత్యంత పరిమితమైనది. అనగా, అనంతంగా స్వేచ్ఛను కలిగియున్న మహాసాగర లేశం, తాను అనంతంగా బంధింపబడి ఉన్నట్లు భావిస్తుంది.

7.2

 Similarly, the atma, which we have compared with a drop of the infinite ocean, obtains a seeming separate existence, though in reality it can never be out of the limitlessness of the limitless, infinite Paramatma which we have compared with the infinite, unlimitedand limitless ocean.

అదేవిధంగా, అనంత మహాసాగరం యొక్క ఒక బిందువుతో పోల్చబడిన ఆత్మ, అనంతం, అపరిమితం, అవధులులేనిది అయిన మహాసాగరంతో పోల్చబడిన అవధులులేని, అనంత పరమాత్మ యొక్క అవధులులేనితనం నుండి వాస్తవానికి ఆవల ఉండడం ఎన్నడూ సాధ్యం కాకపోయినా, అది ఒక ‘పైకి కనిపించే వేర్పాటు ఉనికి’ ని పొందుతుంది. 

7.3

But just as the iota of ocean acquires its limitation as a drop through being in the form of a bubble on the surface of the ocean, and the bubble bestows upon the iota of ocean an apparently separative existence from the infinite ocean, likewise the atma, which is in Paramatma andis Paramatma, apparently experiences separativeexistence from the infinite Paramatma through the limitations of a bubble (of ignorance) with which the atma shrouds itself. No sooner does the bubble of ignorance burst, than the atma not only finds itself in Paramatma but experiences itself as Paramatma.

ఎలాగైతే మహాసాగర లేశం, మహాసాగర ఉపరితలంపై బుడగ రూపాన్నిదాల్చడం ద్వారా బిందువుగా తన పరిమితిని పొందుతుందో మరియు అదే బుడగ మహాసాగర లేశానికి అనంత మహాసాగరం కంటే వేరుగా కనిపించే ఉనికిని ప్రసాదిస్తుందో అలాగే, ఆత్మ పరమాత్మలో ఉంటూ, పరమాత్మగానే ఉంటూ, తన చుట్టూ ఆవరించి యున్న అజ్ఞానమనే బుడగ కల్పించిన పరిమితుల వలన అనంతమైన పరమాత్మ కంటే వేరైన ఉనికిని అనుభవిస్తున్నట్లుగా అగుపిస్తుంది. అజ్ఞానమనే బుడగ పేలిన మరుక్షణం, ఆత్మ, తాను పరమాత్మ లోనే ఉంటునట్లు భావించడమే కాకుండా, తాను పరమాత్మనే అనే అనుభవాన్ని కూడా పొందుతుంది. 

7.4

Through this limitation, formed by the bubble of ignorance, self-created by the atma, the atma apparently inherits a separative existence from Paramatma. And because of this self-created separativeness from infinite Paramatma, the atma, which is itself infinite, unlimited and limitless, apparently experiences itself as most finite with infinite limitations.

ఆత్మ తనకు తానుగా సృష్టించుకున్న అజ్ఞానమనే బుడగ వలన ఏర్పడిన ఈ పరిమితి ద్వారా, పరమాత్మ నుండి తాను ఒక వేర్పాటుఉనికిని పొందినట్లు పైకి కనిపిస్తుంది. అనంతమైన పరమాత్మ నుండి తనకు తాను సృష్టించుకున్న ఈ వేర్పాటుతనం కారణంగా, ఆత్మ తాను అనంతం, అపరిమితం, అవధులులేనిది అయి ఉండి కూడా, అనంతమైన పరిమితులతో, అత్యంత పరిమితమైనదిగా అనుభవాన్ని పొందినట్లు పైకి కనిపిస్తుంది.